కల్కిలో ఆ స్టార్‌ హీరోయిన్స్!

Friday, December 27, 2024

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న చిత్రాల్లో కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి …ఈ సినిమాని స్టార్‌ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.వారికి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేసింది. ఈ మూవీలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

 ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొందరు నటీనటుల సర్‌ప్రైజ్ రోల్స్ ఉంటాయని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ క్రమంలో కొందరి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి .ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శోభన, యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్యామియో రోల్స్ చేశారనే న్యూస్ నెట్టింట షికారు చేస్తుంది.

అయితే ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు సమాచారం.త్వరలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles