చిరు హీరోయిన్‌ తో బన్నీ స్టెప్పులు!

Saturday, December 21, 2024

జాతీయ నటుడు అల్లు అర్జున్‌ , లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప  సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్‌ జాతీయ నటుడిగా అందుకున్న అవార్డు కూడా ఒకటి.

పుష్ప కి కొనసాగింపుగా పుష్ప 2 కూడా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బన్నీ పక్కన రష్మికనే యాక్ట్‌ చేస్తుంది.  మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్  కీలక పాత్రలో  నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట షికారు చేస్తుంది.

బన్నీ- సుక్కు కాంబోలో ఐటెం సాంగ్ కు క్రేజ్ ఏ విధంగా ఉంటుందో  ఆర్య, ఆర్య – 2 సినిమాల్లో మనం చూసాం. మరి ముఖ్యంగా పుష్ప పార్ట్ 1 లోని  ‘ఊ అంటావా మావా ‘ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా పుష్ప – 2 లో  కూడా స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. ఈ సారి ఐటెం సాంగ్  లో 60 ఏళ్ల సీనియర్  భామ మీనాక్షీ శేషాద్రిని  చూపించబోతున్నాడట లెక్కల మాస్టారు.  

ఆపద్భాందవుడు సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది మీనాక్షి శేషాద్రి. ఈ 60 ఏళ్ళ ముద్దుగుమ్మ సుమారు దశాబ్ద కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు  పుష్ప -2 లో స్పెషల్ సాంగ్ తో  టాలీవుడ్‌ రీఎంట్రీకి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. మరీ సుకుమార్‌ ఈ 60 ఏళ్ల భామను పాటలో ఎలా చూపిస్తాడో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles