ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తరువాత చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండడంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే వారి గురించి పలు ఆసక్తికర వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ నటించబోతుందనే వార్త ఎప్పటి నుంచో వినపడుతుంది. ఇక మరో హీరోయిన్‌గా దీపికా పదుకొనే పేరు కూడా వినిపించింది. కానీ, దీపికా ఈ మూవీలో యాక్ట్ చేయడం లేదని.. ఆమె ప్లేస్‌లో ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రానికి ఓకే చెప్పిందని సమాచారం.
దీంతో ఇప్పుడు ఈ సినిమాలో అనన్య పాండే నటిస్తుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిరేపుతుంది. లైగర్ మూవీతో డిజాస్టర్ మూటగట్టుకున్న ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా, సౌత్‌లో మాత్రం అమ్మడికి సరైన మూవీ తగలలేదు. మరి అల్లు అర్జున్ – అట్లీ వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో ఆమెను ఎలాంటి పాత్ర కోసం తీసుకుంటున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
