బన్నీ వచ్చేది అప్పుడేనంట..!

Andhrawatch
1 Min Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్తగా చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను అట్లీ డైరెక్ట్ చేస్తుండగా, షూటింగ్ వేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ ఎంట్రీ సన్నివేశాలను ప్రత్యేకంగా, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మొదట ఈ సినిమాను 2026లో రిలీజ్ చేయాలని అట్లీ టీమ్ అనుకున్నా, తాజా సమాచారం ప్రకారం అది 2027కి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తోంది. అదే సమయంలో రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 కూడా అదే కాలంలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇలా చూస్తుంటే 2027లో అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తలపడే అవకాశం కనబడుతోంది.

Share This Article