మొదటిసారి అలా కనిపించబోతున్న బన్నీ!

Thursday, December 26, 2024

జాతీయ నటుడు అల్లు అర్జున్‌ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా సినిమాలు లేని సమయంలోనే కేరళలో బన్నీకి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది.  పుష్ప సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క.. ఆ తరువాత ఓ లెక్క.

పుష్ప సినిమా తర్వాత బన్నీ రేంజ్ మారిపోయింది.  ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా వసూళ్లను రాబట్టింది.  పుష్ప దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు అర్జున్ అలాంటి జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరలు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమా ఆగస్టు 15 ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాల ను లైనప్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అట్లీ కథను బన్నీ కోసం సిద్ధం చేస్తున్నాడనే టాక్‌ బలంగా ఇచ్చినా దాని గురించి ఇప్పటిదాకా అనౌన్స్ మెంట్ రాలేదు. కథ విషయంలో ఇంకా ఫైనల్ అవ్వలేదని తెలుసుకుంది.. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి అల్లు అర్జున్ తో చేయబోతున్న మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.. అయితే ఈ సినిమా స్టోరీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ ఎప్పటిలాగా కాకుండా, ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ని పక్కనపెట్టి ఈసారి త్రివిక్రమ్ ఫాంటసీ టచ్ ఉన్న భారీ సబ్జెక్టుని రెడీ చేసినట్టు సమాచారం. ఈ సినిమా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles