బన్నీ ఇరగదీశాడంతే..అదిరిన పోస్టర్‌!

Wednesday, April 9, 2025

ఐకాన్‌ స్టార్‌ , జాతీయ నటుడు అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, రష్మిక హీరోయిన్‌ గా లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్  సినిమా పుష్ప 2. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన పుష్ప కి సీక్వెల్‌ గా ఈ సినిమాని తీస్తుండడంతో ఈ సినిమాకి పాన్‌ ఇండియా లెవల్లో పుష్ప 2 మీద అంచనాలు నెలకొన్నాయి.

 ఇక ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ విడుదలకు ఈరోజు నుంచి రిలీజ్ కి 100 రోజుల దూరంలో ఉంది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఒక క్రేజీ అండ్ పవర్ఫుల్ పోస్టర్ ని అయితే విడుదల చేశారు. ఇందులో బన్నీ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుండగా సినిమాలో హైప్ ఇస్తున్న జాతర సీక్వెన్స్ తోనే మరోసారి చూపించారు.

ఆ గెటప్ లో ఐకాన్ స్టార్ అయితే అభిమానులు ఊహించని రేంజ్ లో కనిపిస్తుండడం చూడొచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లో ఈ ఏడాది డిసెంబర్ 26న సినిమా గ్రాండ్ గా 6 భాషల్లో విడుదలకి రెడీ గా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles