క్రిష్‌ డైరెక్షన్‌ లో బన్నీ..కాంబో అదిరిపోతుందంతే!

Saturday, December 21, 2024

ఐకాన్ స్టార్, జాతీయ నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమాతో ఫుల్లు బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తుండగా, బన్నీ మరోసారి తనదైన యాక్షన్‌ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, బన్నీ దర్శకుడు క్రిష్ కాంబోలో ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.

కానీ.. ఇది సినిమా కోసం కాదట. ప్రముఖ కూల్ డ్రింక్ థంబ్స్ అప్ యాడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌ను సదరు కంపెనీ నియమించింది. దీంతో ఈ కూల్ డ్రింక్ యాడ్‌లో బన్నీ నటించబోతున్నడట. కాగా, ఈ యాడ్‌ను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేయబోతున్నాడట.

గతంలో ఈ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విజయ్ దేవరకొండ కూడా కొన్ని యాడ్‌లు చేశాడు. ఇప్పుడు థంబ్స్ అప్ యాడ్‌లో అల్లు అర్జున్ కనిపిస్తాడనే వార్తతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. బన్నీ ఈ యాడ్‌లో ఎంతటి ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడా అని వారు అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఇది ఆయన క్రేజ్‌కి నిదర్శనం అని వారు ఉప్పొంగిపోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles