ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో భారీ విజయాన్ని సాధించిన తర్వాత తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈసారి అట్లీ డైరెక్షన్‌లో ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ అవుతోందని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్టూడియోలు కూడా జట్టు కడుతున్నారని టాక్.
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి అమెరికాలో గడిపిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల నాట్స్ తానా కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ, ఈ ఈవెంట్ తర్వాత తన భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అర్హ, అయాన్‌తో కలసి యూఎస్‌లో కనిపించాడు. యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర తన కుమారుడు అయాన్‌తో ఉన్న ఫోటో కూడా బయటకు రావడంతో అభిమానుల్లో మరింత క్రేజ్ పెరిగింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెట్‌లో వీటి గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.
