కరునాడ చక్రవర్తి’కి స్వాగతం చెప్పిన బుచ్చిబాబు టీం!

Friday, January 17, 2025

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న  సినిమా RC16. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇటీవలే గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ పూర్తిచేసుకున్న చరణ్‌.. త్వరలోనే RC16తో బిజీ కానున్నాడు. ఆర్సీ 16 సినిమాలో కన్నడ ‘సూపర్ స్టార్’ శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా RC16 చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఓ పోస్టర్ రిలీజ్ చేసి.. ‘కరునాడ చక్రవర్తి’కి స్వాగతం అంటూ రాసుకొచ్చింది.

RC16 టీమ్ తరఫున శివన్నకి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్లో పేర్కొంది. ఈరోజుతో శివన్న 61 పడిలోకి అడుగుపెట్టారు. శివన్న ఇప్ప‌టికే బ‌జ‌రంగీ, వేధ, జైల‌ర్ వంటి చిత్రాలతో తెలుగు నాట కూడా మంచి గుర్తింపును ద‌క్కించుకున్న శివ రాజ్‌కుమార్.. మొదటిసారి తెలుగు సినిమాలో న‌టిస్తుండ‌డంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

బుచ్చిబాబు విజన్‌ ఉన్న డైరెక్టర్‌ అని శివ రాజ్‌కుమార్‌ కొనియాడిన విషయం అందరికీ తెలిసిందే. ‘నాకు స్క్రిప్టు నెరేట్‌ చేసేందుకు బుచ్చిబాబు సంప్రదించగా.. అరగంట సమయం ఇచ్చా. ఆయన వివరించే తీరు బాగుండడంతో గంటన్నరపైగా కేటాయించా. కథ, అందులోని పాత్రలను బుచ్చిబాబు చక్కగా రాశారు. రామ్‌ చరణ్‌ అద్భుతమైన నటుడు. అంతకుమించి మంచి మనిషి’ అని శివన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles