కింగ్డమ్‌లో బ్రదర్‌ సెంటిమెంట్‌!

Tuesday, December 9, 2025

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాను ‘జెర్సీ’, ‘నాని గ్యాంగ్‌లీడర్’ సినిమాలతో పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు తీసుకురాగా.. మ్యూజికల్ ప్రమోషన్స్‌కు సంబంధించిన తాజా అప్డేట్‌తో ఈ ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా కింగ్డమ్ చిత్ర బృందం, రెండో పాటగా “అన్న అంటేనే..” అనే భావోద్వేగభరితమైన పాటను రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో చిన్నవయస్సులో హీరో తన అన్నతో కలిసి దిగిన ఓ మధురమైన ఫోటోను చూపించారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు అన్న పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్నారని సమాచారం. పాట ప్రోమోను జూలై 15వ తేదీ సాయంత్రం 5:05కి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు అనిరుధ్ రవిచంద్రన్. ఆయన ఇప్పటికే సినిమాకు సంబంధించి మొదటి పాటతో మంచి బజ్ క్రియేట్ చేశాడు. రెండో పాటపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉండటం విశేషం.

ఈ సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీ బొర్సె నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా, జూలై 31న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ సినిమా ఎమోషనల్ డ్రామాతో పాటు మంచి మ్యూజిక్, బంధాల నేపథ్యంలో సాగుతుందనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles