టాలీవుడ్ బిగ్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల ఫాలోయింగ్ అండ్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా గట్టిగా ఉంటుంది. ఇలా వారి సినిమాలు వస్తున్నాయి అంటే మిలియన్స్ కొద్దీ వసూళ్లు వసూలు చేయాల్సిందే.
ఇక లేటెస్ట్ గా ఈ ఇద్దరు హీరోల సినిమాల తాలూకా బుకింగ్స్ ఇపుడు మొదలు కానున్నాయి. మహేష్ ఖలేజా యూఎస్ మార్కెట్ లో గ్రాండ్ గా విడుదల అవుతుండగా దీంతో పాటుగా జూన్ లో విడుదల అవుతున్న వీరమల్లు సినిమా బుకింగ్స్ కూడా ఈ శుక్రవారం నుంచే మొదలు కానున్నాయంటూ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చెప్పుకొచ్చింది. మరి ఈ రెండు సినిమాలు కూడా తమ అభిమానులకి ఎంతో ప్రత్యేకం. మరి చూడాలి ఈ సాలిడ్ సినిమాలకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
