బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మైథలాజికల్ ఎపిక్ ప్రాజెక్ట్ “రామాయణం”పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని నితీష్ తివారి తెరకెక్కిస్తుండగా, ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంది. విజువల్స్, కాస్ట్యూమ్స్, మేకింగ్ స్టైల్ చూసినవారంతా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక తాజా బజ్ ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్ మొదటగా రణ్‌బీర్‌తో కాదు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని దర్శకుడు నితీష్ తివారి ప్రణాళిక వేసినట్టు సమాచారం. ఇందులో మహేష్ రాముడిగా కనిపించాలన్న ఆలోచనతో ఆయనను సంప్రదించినట్టు ఇండస్ట్రీ టాక్. అయితే అప్పటికే మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ, రాముడి పాత్రకు మహేష్ బెస్ట్ ఛాయిస్ అయ్యేవాడని, అలాంటి చాన్స్ మిస్ అవ్వడం నిరాశ కలిగించిందంటున్నారు. ఇక ఈ రామాయణంలో రావణాసురునిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్న విషయం ఇప్పటికే హైప్‌ను పెంచేస్తోంది.
ఓ పక్క రాజమౌళి సినిమా, మరోవైపు రామాయణం లాంటి ఎపిక్ ప్రాజెక్ట్… ఇలాంటి రెండు భారీ ఆఫ్షన్ల మధ్య నితీష్ తివారి ప్లాన్ ఎలా మారిందో ఇప్పుడు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
