23 నే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి పెళ్లి!

Wednesday, January 22, 2025

బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ మరో ముద్దుగుమ్మ సోనాక్షి కూడా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి వివాహమడునుంది. ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. మరోవైపు కాబోయే వధూవరులు బ్యాచిలర్ పార్టీలతో బిజీ బిజీగా ఉన్నారు.

 వాటికి  సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తాజాగా సోనాక్షి-జహీర్ పెళ్లికి సంబందించిన ఓ న్యూస్ నెట్టింట షికారు చేస్తుంది.  సోనాక్షి సిన్హా హల్దీ వేడుక గురువారం జరగనునట్లు సమాచారం. బాంద్రాలోని తన నివాసంలో జరిగే ఈ వేడుకకు సన్నిహితులు,  కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరుకానున్నట్లు సమాచారం.

ఇక పెళ్లి 23న ముంబైలో జరగనుంది. సోనాక్షి-జహీర్ జంట ముంబైలోని బాస్టియన్‌లో పెళ్లి చేసుకుంటున్నారని సమాచారం. ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. పెళ్లి అనంతరం రిసెప్షన్ గ్రాండ్‌గా ఏర్పాటు చేసి.. బాలీవుడ్ నటీనటులను అందరినీ పిలవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా బయటకు తెలియజేయలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles