ఆ రూమర్స్‌ పై స్పందించిన బాలీవుడ్‌ హీరోయిన్‌!

Wednesday, April 2, 2025

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడ్ని థానేలో ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అయితే, సైఫ్‌ పై దాడి అనంతరం ఆయన సతీమణి కరీనాకపూర్‌ను తప్పుపడుతూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల పై బాలీవుడ్‌ స్టార్ అక్షయ్‌ కుమార్‌ సతీమణి, రచయిత ట్వింకిల్‌ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘సైఫ్‌ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన భార్య కరీనా కపూర్ గురించి ఎన్నో పుకార్లు షికారు చేశాయి.

సైఫ్ పై దాడి జరిగినప్పుడు ఆమె ఇంట్లో లేదని కొందరు.. గాయాలతో ఇబ్బందిపడుతున్న ఆయనకు ఆమె ఏమాత్రం సాయం చేయలేదని మరికొందరు ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక మహిళ పై ఇలా మాట్లాడటం చాలా బాధాకరం. అదే విధంగా విరాట్‌ కోహ్లీ సరిగ్గా ఆడనప్పుడల్లా కొంతమంది ఆయన భార్య అనుష్క శర్మను నిందిస్తూ పోస్ట్ లు పెడతారు.

ఇలాంటి వారిని ఏం చేయాలి ?’ అని ఆమె అన్నారు. ఇక సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని బాంద్రాలోని హాలిడే కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles