చరణ్‌ కోసం బాలీవుడ్ బాద్‌ షా!

Tuesday, December 9, 2025

గ్లోబల్ స్టార్, మెగా పవర్‌ స్టార్‌  రామ్ చరణ్ హీరోగా,  మార్వ్‌లెస్‌ డైరెక్టర్‌ శంకర్ కాంబో లో చేస్తున్న లాంగ్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్.  ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అంచనాలు సెట్ చేసుకుంది. దీంతో  ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తుండగా తాజాగా గ్రాండ్ లెవెల్లో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

మరి శంకర్ మార్క్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన  ఈ సినిమా పై ఇపుడు మరో క్రేజీ రూమర్ అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మూలుగా శంకర్ సినిమాల ప్రీ రిలీజ్ లు, ఆడియో వేడుకలు ఏ లెవెల్లో ఉంటాయో అందరికీ తెలిసిందే.

హాలీవుడ్ హీరోలని సైతం శంకర్ రప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఇపుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక కోసం గ్రాండ్ ప్లానింగ్స్ మొదలు పెట్టినట్లుగా  రూమర్స్ వినపడుతున్నాయి.

అలా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని అయితే గేమ్ ఛేంజర్ కోసం పిలుసత్ఉన్నారనే రూమర్స్ వినపడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆల్రెడీ టీజర్ కే గ్రాండ్ ప్లానింగ్స్ చేశారు. మిగతా వాటికి కూడా అంతకు మించే ఉంటాయని చెప్పడంలో ఏం డౌట్‌ లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles