కన్నప్పలో బాలీవుడ్‌ నటుడు!

Wednesday, January 22, 2025

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌  అయిన కన్నప్పలో ఆయన టైటిల్‌ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఇంటర్‌నెట్‌లో తెగ షేర్ అవుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే  సౌత్ ప్రముఖ స్టార్స్ అందరూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్‌ కూడా రంగంలోకి దిగింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ ఇందులో నటిస్తున్నట్లు సమాచారం.

చిత్ర బృందం ఈ విషయాన్ని ట్విట్టర్  వేదికగా పంచుకున్నారు. త్వరలోనే అక్షయ్‌ షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నారని వివరించారు. ఇదంతా నిజమే అయితే  ఆయనకు ‘కన్నప్ప’ తొలి తెలుగు సినిమా అవుతుంది. అయితే అక్షయ్‌ ఇప్పటి వరకు సౌత్ లో రెండే సినిమాలు చేశారు. అవి కన్నడలో 1993 లో నటించగా.. 2018లో రోబో 2.0 లో తమిళంలో నటించారు.

ఇప్పుడు ఈ సినిమాతో తెలుగు  పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాలో అక్షయ్‌ ఏ పాత్రలో కనిపించనున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వస్తేగానీ క్లారిటీ రాదు.ఈ సినిమాలో ఇప్పటికే మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌ భాగమయ్యారు. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. శివ పార్వతులుగా ప్రభాస్‌, నయనతార నటించనున్నారని ఎప్పటి నుంచో నడుస్తున్న టాక్. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. మోహన్‌బాబు నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles