బాలయ్య సినిమాలో విలన్‌ గా ఫిక్స్‌ అయిన బాలీవుడ్‌ నటుడు!

Monday, September 16, 2024

నందమూరి నటసింహం బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా “NBK 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను చిత్ర బృందం దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య తనకి ఎంతో ఇష్టమైన  డైరెక్టర్ బోయపాటి కాంబో లో అఖండ 2 సినిమాలో చేయనున్నట్లు సమాచారం.

వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అఖండ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాలో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి.ఇదిలా ఉంటే త్వరలోనే అఖండ 2 సెట్స్ పైకి వెళ్తున్నట్లు టాక్‌.

ఇప్పటికే డైరెక్టర్‌ బోయపాటి స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలో బాలయ్యకు సరిసమానమైన ప్రతినాయకుని వేట మొదలు పెట్టిన బోయపాటి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఏఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles