మట్కా’ సెట్స్‌లో పుట్టిన రోజు వేడుకలు!

Tuesday, January 21, 2025

మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న సినిమా ‘మట్కా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే
. ఈ సినిమాను ‘పలాస’ సినిమా దర్శకుడు కరుణ కుమార్ అత్యంత ప్రెస్టీజియస్‌గా  తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా  మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నేడు నిర్మాత రామ్ తాళ్ళూరి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు ఓ స్వీట్‌  సర్‌ప్రైజ్ ఇచ్చారు. చిత్ర షూటింగ్ సెట్స్‌లో నిర్మాత రామ్ తాళ్ళూరి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు చిత్ర యూనిట్. కేక్ కట్ చేయించి తమ విషెస్ తెలపింది చిత్ర బృందం. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట షికారు చేస్తున్నాయి.

ఇక ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చిత్ర బృందం రూపొందిస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్నారు.  ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles