త్రిశూలంతో త్రినేత్రుడిలా బర్త్‌ డే బాయ్‌!

Wednesday, January 22, 2025

బింబిసార ఫేమ్‌ వశిష్ఠ డైరెక్షన్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంబర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ ఫిలింగా ఈ సినిమాని వశిష్ఠ తీర్చిదిద్దుతుండగా…యూవీ క్రియేషన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా చేస్తున్నట్లు సమాచారం.  ఈ సినిమాని గతేడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. సినిమా షూటింగ్ జనవరి నెలలో మొదలైంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదో తేదీన విడుదల చేస్తున్నట్లు సినిమా అనౌన్స్ చేసినప్పుడే ప్రకటించారు.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన పోస్టర్ ఒకదాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా నిలబడి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక గద పట్టుకుని కనిపించే పోస్టర్ వదులుతారని లీకులు వచ్చినా ఒక కొండ మీద త్రిశూలంతో ఒక మోకాలి మీద మోకరిల్లినట్టు చిరంజీవి కనిపిస్తున్నారు.

ఒక రకంగా ఈ పోస్టర్ తో మెగా అభిమానులందరికీ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు వశిష్ట.ఎంఎం కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమాకి చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని సోషియో ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి లైన్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతుందనే ప్రచారం అయితే ముందునుంచి జరుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles