పెద్ద ట్విస్టే!

Wednesday, January 22, 2025
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా  భారీ సూపర్‌ హిట్ సినిమా “దేవర”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటకీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వసూలు చేసింది. అలాగే ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ గ్రాండ్ సీక్వెల్ ని కూడా ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారు.

అలాగే పార్ట్ 2 లో చాలా రకాల ఆసక్తికర ప్రశ్నలకి కూడా కొరటాల సమాధానలు చెప్పాల్సి ఉంది. అయితే పార్ట్ 2 పై ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు తాజాగా వినపడుతుంది. దీంతో పార్ట్ 2 లో వరతో పాటు  దేవర కూడా కనిపించొచ్చు అని సమాచారం. అలాగే క్లైమాక్స్ లో దేవర కచ్చితంగా చనిపోయినట్టు కూడా చూపించలేదు అని సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్టులు చెబుతున్నారు.

అలాగే దేవర పార్ట్ 2 లో ఇద్దరే ఉండాలని లేదు ముగ్గురు కూడా ఉండొచ్చు ఏమో అంటూ దేవర కి వర్క్ చేసిన ఓ ఆర్టిస్ట్ తాజాగా కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్‌ గా మారాయి. మరి ఇదే కానీ నిజం అయితే మాత్రం దేవర 1 విషయంలో కొంచెం డిజప్పాయింట్ అయ్యినవారు కచ్చితంగా పార్ట్ 2 కి ఓ రేంజ్ లో ఖుషీ అవుతారని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles