చరణ్‌ కి పెద్ద టాస్కే!

Andhrawatch
1 Min Read

మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన పలు భారీ మల్టీస్టారర్‌ సినిమాల్లో ఈ మధ్యలో వచ్చిన బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ ఏదన్నా ఉంది అంటే అది మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ , యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాతో ఇద్దరి హీరోల నడుమ ఉన్న బాండింగ్ ఎంత గట్టిది అనేది అందరికీ తెలిసిందే.

అలాగే గ్లోబల్ వైడ్ గా వారి క్రేజ్ ని కూడా విపరీతంగా పెంచేసింది. అయితే ఇక ఈ సినిమా తర్వాత ఇద్దరూ  రెండు భారీ సినిమాలను సోలోగా చేస్తున్నారు. మరి వీటిలో తారక్ చేస్తున్న “దేవర” చరణ్ “గేమ్ ఛేంజర్” కంటే లేట్ గానే మొదలు అయినప్పటికీ ముందే విడుదలకి వచ్చేస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ నుంచి వెళ్లిన పాన్ ఇండియా సినిమాల్లో ఫాస్టెస్ట్ ప్రీ సేల్స్ రికార్డుని అందుకుంది.

యూఎస్ మార్కెట్ లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని విడుదల కి ముందే అందుకొని భారీ టార్గెట్ ని ఇతర హీరోలకి సెట్ చేసింది. మరి దీనిని తన కో స్టార్ రామ్ చరణ్ తన “గేమ్ ఛేంజర్” తో బీట్‌ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే మరి. గేమ్ ఛేంజర్ పై కూడా బజ్ గట్టిగానే ఉంది.. మరి దేవర తర్వాత రాబోతున్న ఈ చిత్రం దానిని క్రాస్ చేస్తుందో లేదో మరికొన్ని నెలలు వెయిట్‌ చేయాల్సిందే.

Share This Article