గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇటీవల టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె కారణంగా కొంత విరామం తీసుకున్న ఈ సినిమా యూనిట్, ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచింది.
ఆగస్టు 27 వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఓ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజునుంచి సినిమాలోని ఒక గ్రాండ్ సాంగ్ షూట్ మొదలైనట్టు వీడియో రూపంలో ప్రకటించారు. ఈ పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకం టీమ్‌లో కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ అందించిన ఎనర్జిటిక్ బీట్స్‌తో పాట మరింత పవర్‌ఫుల్‌గా రూపుదిద్దుకుంటుందని సమాచారం.
రామ్ చరణ్ ఎలక్ట్రిక్ స్టెప్పులు, రెహమాన్ సంగీతం కలిస్తే ఆ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు బుచ్చిబాబు వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
