భోజ్‌ పూరి హీరోయిన్‌ స్పెషల్‌ సాంగ్‌!

Thursday, December 19, 2024

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమైంది. నవంబర్ 17 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బిహార్‌లోని పాట్నా గాంధీ మైదాన్‌లో గ్రాండ్‌గా జరపబోతున్నారు.  ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కానున్నట్లు సమాచారం.

అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మరింత హైప్ క్రియేట్ చేసేలా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ లాంట్ ఈవెంట్‌లో భోజ్‌పురి హీరోయిన్ అక్షర సింగ్‌తో ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌పై హైప్ పెంచేస్తున్నారు చిత్ర యూనిట్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాలిడ్ యాక్షన్‌ తో  ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాడని మేకర్స్ ఫుల్‌  కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమాలో రష్మిక తో పాటు, ఫహద్ ఫాజిల్ వంటి వారు ముఖ్య పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles