భజే వాయువేగం ట్రైలర్‌ అదిరిపోయిందిగా!

Monday, July 1, 2024

టాలీవుడ్ యంగ్‌ హీరో కార్తీకేయ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తికేయ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం లభించలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజ‌యాన్ని అందుకున్నాడు.

ప్రస్తుతం కార్తికేయ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’. ఈ సినిమాను ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది.ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్  ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ఈ  సినిమా మే 31న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈక్ర‌మంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ బాగా వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles