మాస్ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ‘భైరవం’ టీజర్

Monday, January 20, 2025

మాస్ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ‘భైరవం’ టీజర్ టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ఇచ్చాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం పవర్‌ఫుల్ మాస్ యాక్షన్‌తో ఈ టీజర్‌ను కట్ చేశారు. ముగ్గురు హీరోలు కూడా తమ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది.

ఇక ఈ టీజర్‌లో కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు కూడా పేలాయి. భారీ క్యాస్టింగ్‌తో దర్శకుడు విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మొత్తంగా ‘భైరవం’ మూవీ ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌తో రాబోతుందని ఈ టీజర్ ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, సందీప్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles