కోనసీమలో ‘భైరవం’ సాంగ్ షూట్

Sunday, January 19, 2025

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా  ‘భైరవం’ ఇప్పటికే  ప్రేక్షకుల్లో మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి యంగ్‌ యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తుండడంతో  సినిమాలో కచ్చితంగా ఏదైనా స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన తాజా అప్డేట్‌ను దర్శకుడు విజయ్ కనకమేడల అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అదితి శంకర్‌తో ఓ సాంగ్ షూటింగ్ కోసం కోనసీమకు వెళ్తున్నట్లు విజయ్ కనకమేడల తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా.. ఎవరిపై ఈ సాంగ్ చిత్రీకరణ చేస్తున్నారా.. అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ త్వరలో రాబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles