భైరవం ఓటీటీ విడుదల ముహుర్తం ఖరారు!

Monday, December 8, 2025

టాలీవుడ్‌కి చెందిన టాలెంటెడ్ హీరోలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన తాజా చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయిన గరుడన్‌కు రీమేక్‌గా రూపొందింది. మంచి కథతో వచ్చినప్పటికీ తెలుగులో ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఓటీటీ వేదికగా ఈ సినిమాకి మరోసారి అవకాశం దక్కింది.

ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జీ5 ముందుకొచ్చింది. జూలై 18నుంచి ఈ మూవీ అక్కడ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ భాషలోనూ ఈ సినిమాను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

భైరవం థియేటర్లలో విడుదలై చాలా రోజులు గడిచిపోయింది కానీ, ఇప్పటికైనా ఈ కథను ఓటీటీ ద్వారా చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. స్టైలిష్ ప్రెజెంటేషన్, ఇంటెన్స్ న్యారేషన్ ఉన్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇంకా పదిరోజులు ఆగితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles