భైరవం సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ల కాంబినేషన్‌లో వచ్చిన స్పెషల్ ప్రాజెక్ట్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి రిలీజ్ సమయంలోనే ప్రేక్షకులలో ఆసక్తి కనిపించింది. థియేటర్స్‌లో వచ్చిన తరువాత కొద్ది వారాలకే ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులను కూడా చేరుకుంది.
జీ5 ప్లాట్‌ఫామ్‌లో తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన భైరవం అక్కడ మంచి వ్యూస్ సంపాదించింది. తాజాగా జీ తెలుగు ఛానెల్‌లో మొదటిసారి టెలికాస్ట్ అవగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందిన సమాచారం ప్రకారం ఈ ప్రసారానికి 5.7 టీఆర్పీ రేటింగ్ రాగా, ఇది ఇటీవలి కాలంలో వచ్చిన ఉత్తమ రేటింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఇక ఓటిటి వేదికలో ఈ సినిమా 150 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ సాధించిందని చెబుతున్నారు.
