అంతకు మించి!

Friday, October 11, 2024

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ ని ఎవ్వరూ ఎప్పుడూ ఊ. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ, యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఈ క్రేజీ కాంబోని సెట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు తారక్‌. స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టుగా ఓ టాక్‌ వినిపిస్తుంది.

అందుకోసం ఏకంగా వంద కోట్ల పారితోషికం అందుకున్నట్టుగా కూడా ప్రచారంలో ఉంది. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో ఉంటుందని బీ టౌన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ ఎవరి ఊహకందని రీతిలో ఉంటాయని మూవీ మేకర్స్‌ అంటున్నారు. అలాగే ఈ ఇద్దరిపై ఉండే సాంగ్.. నాటు నాటుకి మించి ఉంటుందని, వీళ్ల స్టెప్పులకు స్క్రీన్స్ తగలబడిపోతాయని అంటున్నారు.

ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ పలు కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు దేవర హిట్ జోష్‌లో ఉన్న టైగర్.. నెక్స్ట్ వార్ 2 షెడ్యూల్‌కి  సిద్దమవుతున్నారు. ఈ నెలలోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్‌లో సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని తెలియగా.. ఇప్పుడు క్లైమాక్స్‌ షూటింగ్‌ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య జరిగే ఈ క్లైమాక్స్‌ని నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles