ఇప్పుడే ఆట మొదలైందంటున్న బెల్లంకొండ శ్రీనివాస్‌!

Wednesday, January 22, 2025

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇటు టాలీవుడ్‌ లోనే కాకుండా..అటు బాలీవుడ్‌ లో కూడా అడుగుపెట్టి తనదైన శైలిలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో మరోసారి టాలీవుడ్‌ లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పటికే టైసన్‌ నాయుడు సినిమాతో బిజీ అయ్యాడు.  ఈ క్రమంలోనే తన నెక్ట్స్ చిత్రంగా ‘కిష్కిందపురి’ మూవీని కూడా బెల్లంకొండ తెరకెక్కిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా లుధీర్ బైరెడ్డి డైరెక్షన్‌లో ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్రారంభించి సినిమాని ట్రాక్‌ పైకి తీసుకుని వచ్చాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలు చిత్రీకరణలో ఉండగానే, శ్రీనివాస్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘మా ఊరి పొలిమేర’ చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు బెల్లంకొండ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడంట. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆట మొదలైంది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారంట.

అయితే, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో పాటు సోషియో ఫాంటసీ మూవీగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించాలని బెల్లంకొండ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles