బెల్లంకొండ శ్రీ‌నివాస్.. ఆ సినిమాల బాటలోనేనా?

Wednesday, January 22, 2025

టాలీవుడ్ లో ఇటీవ‌ల కాలంలో ఇతిహాసాల‌కు సంబంధించిన రిఫ‌రెన్స్ లు బాగా వ‌ర్క‌వుట్ అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ జాబితాలో వ‌చ్చిన ‘హ‌నుమాన్’, ‘క‌ల్కి 2898 AD’ చిత్రాలు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాల్లో రామాయ‌ణం, మ‌హాభార‌తం రిఫ‌రెన్స్ లు ప్రేక్ష‌కుల‌కు బాగా అలరించాయి. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగా రాబట్టాయి. ఇప్పుడు ఇదే బాట‌లో మరో యంగ్ హీరో కూడా త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ఆ దిశగానే పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్ప‌టికే ‘టైస‌న్ నాయుడు’, ‘కిష్కింద‌పురి’ అనే సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్ లోని 12వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టాడు. అయితే, ఈ సినిమా నేప‌థ్యం ద‌శావ‌తారం చూట్టూ తిరుగుతుంద‌ని సమాచారం. ఈ సినిమాలో 400 ఏళ్ల‌నాటి ఓ ఆల‌యం ఉంటుంద‌ని.. దానిలో ద‌శావ‌తారాలు ప్ర‌తిష్టించి ఉంటాయ‌ని చిత్ర వ‌ర్గాల్లో ఓ టాక్‌ నడిపిస్తుంది. ఆ ఆల‌యానికి, ద‌శావ‌తారాల‌కి, హీరోకి సంబంధం ఏమిటి అనేది సినిమా క‌థ‌గా తీయనున్నారంట.

టాలీవుడ్ లో ద‌శావ‌తారాల రిఫ‌రెన్స్ చాలా అరుదు. ఇలాంటి నేప‌థ్యంలో ఇప్పుడు సినిమా వ‌స్తుంద‌నే వార్తతో ఈ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు ‘హైంధ‌వ’ అనే ప‌వ‌ర్ఫుల్ టైటిల్ ను పెట్టేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ఈ సినిమాలో ద‌శావ‌తారాల రిఫ‌రెన్స్ ను చిత్ర యూనిట్ ఏ విధంగా చూపెట్ట‌నుందో తెలియాలంటే ఇంకా కొంత‌కాలం ఆగాల్సిందే..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles