ప్రభాస్‌ పై హాట్‌ కామెంట్స్‌ చేసిన బ్యూటీ!

Wednesday, January 22, 2025

హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  తెలుగులో స్టార్ హీరోయిన్ గా చాలా రోజులు ఓ ఊపు ఊపింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అజయ్‌ దేవగణ్‌ సరసన జంటగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘దే దే ప్యార్‌ దే 2’లో నటిస్తుంది. అయితే, ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ప్రభాస్‌ చేసిన ఓ సినిమాలో తన స్థానంలో కాజల్‌ను తీసుకోవడం పై రకుల్ మరోసారి స్పదించింది.

ఇంతకీ, ఆమె ఏం మాట్లాడిందో తెలుసా…‘ప్రభాస్‌ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను ఢిల్లీలో చదువుకుంటున్నాను. దీంతో, షెడ్యూల్‌ పూర్తి కాగానే తిరిగి ఢిల్లీ వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్‌ కోసం ఎన్నిరోజులైనా ఫోన్‌ రాలేదు’ అని రకుల్ చెప్పింది.

ఇదే విషయం గురించి రకుల్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ తర్వాత కొన్ని రోజులకు నా స్థానంలో కాజల్‌ ను తీసుకున్నట్లు తెలిసింది. నాకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ సినిమా నుంచి నన్ను తొలగించడం నన్ను బాధపెట్టింది. కానీ, అప్పటికే ప్రభాస్‌- కాజల్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దీంతో, మరోసారి ఆ జోడినే అయితే బాగుంటుందని చిత్రబృందం నన్ను తొలగించింది. సినిమా అనేది ఓ వ్యాపారం కాబట్టి ఇది సహజమే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles