ఎన్బీకే 109 నుంచి బి హైండ్‌ ది సీన్స్ గ్లింప్స్‌!

Sunday, December 22, 2024

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ బాబీ రూపొందింస్తుండటంతో ప్రేక్షకులతో పాటు సినీ సర్కిల్స్‌లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వరుస విజయాలతో సాలిడ్ ఫాంలో ఉన్న బాలయ్య, ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక గురువారం దర్శకుడు బాబీ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ NBK109 నుంచి ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ‘బిహైండ్ ది సీన్స్’ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. దర్శకుడు బాబీ చిత్ర షూటింగ్‌లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.

నటీనటులతో ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్‌ను రప్పించుకుంటున్నారు.. యాక్షన్ సీన్స్ కోసం బాబీ స్వయంగా ఎంత కష్టపడుతున్నారనే సీన్స్ మనకు ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాబీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles