నందమూరి నటసింహం బాలకృష్ణ పద్మ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. అయితే బాలయ్య ఇపుడు అఖండ 2 చేస్తున్న నేపథ్యంలో ఈ అత్యున్నత పురస్కారం రావడంలో అభిమానులు మరింత ఆనందంగా ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా బాలయ్య. తన కుటుంబంపై పలు బ్యూటిఫుల్ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. వీటితో పాటుగా ఓ క్రేజీ క్లిప్ ఇపుడు నెట్టింట షికారు చేస్తుంది..
మరి ఇందులో బాలయ్య తన హిందీ స్పీచ్ తో అదరగొట్టారని చెప్పాలి. నార్త్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యేలా పద్మ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ముచ్చటించిన బాలయ్య తన ఇటీవల సినిమాలు అలాగే తన కుటుంబ నేపథ్యం ఇంకా తన సేవా కార్యక్రమాల కోసం కూడా చెప్పడం జరిగింది. దీనితో ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మళ్ళీ బాలయ్య ఇపుడు యథావిధిగా అఖండ 2 లో బిజీగా మారనున్నారు.
