అదిరిపోయిన బాలయ్య లుక్‌!

Wednesday, September 18, 2024

నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా ప్రస్తుతం తన కెరీర్ 109వ సినిమా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుండగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య రెండు మూడు లుక్స్ ని ప్రిపేర్ చేశారు కానీ తాజాగా నాలుగో లుక్ ఒకటి ఫ్యాన్స్ కి ఊహించని విధంగా ట్రీట్ ఇచ్చింది.

అయితే ఇందులో బాలయ్య మళ్ళీ తన చెన్నకేశవరెడ్డి, నరసింహా నాయుడు రోజుల్లో తరహాలో వింటేజ్ లుక్స్ తో అదరగొట్టారు. కానీ ఈ లుక్ అయితే సినిమాలో లేదు అన్నట్టు సమాచారం. ఇది కేవలం ఒక యాడ్ షూటింగ్ కోసం మాత్రమే ప్రిపేర్ చేసింది అని తెలుస్తుంది. ఒకవేళ ఈ లుక్ కానీ సినిమాలో ఉండుంటే ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ వచ్చి ఉండేది అని చెప్పుకొవచ్చు.

ఇక ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్  వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles