బాలయ్య వాయిస్‌ ఓవర్‌ ఫర్‌ వీడీ 12

Wednesday, January 22, 2025

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతున్న ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా నుండి త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. కాగా, ఈ టీజర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ వార్త షికారు చేస్తుంది. ఈ టీజర్‌లో నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఉండనుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా VD12 టీజర్‌కి సంబంధించిన ఆసక్తి అయితే క్రియేట్‌ అయ్యింది. మరి నిజంగానే ఈ సినిమా టీజర్‌లో బాలయ్య పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుందా.. లేక ఇదంతా కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా.. అనేది వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles