టాలీవుడ్ చందమామ కోసం రంగంలోకి బాలయ్య!

Thursday, July 4, 2024

టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ చందమామ కాజల్‌ తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది.  గతేడాది భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను మే 24న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా బాలయ్య రానున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

కాజల్ తో భగవంత్ కేసరి సినిమా చేశారు బాలయ్య.. బాలయ్య రాబోతుండటంతో ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles