టాలీవుడ్ లో ఉన్నటువంటి సెన్సేషనల్ సంగీత దర్శకుల్లో మ్యాడ్ బీట్స్ అందించే సంగీత దర్శకుడు థమన్ కూడా ఒకరు. మరి థమన్ కి నటసింహం బాలకృష్ణకి ఒక సెపరేట్ ట్రాక్ కూడా తెలుగు సినిమాలో ఉందని చెప్పాలి. “డిక్టేటర్” సినిమా నుంచి ఇపుడు “డాకు మహారాజ్” వరకు కూడా బాలయ్య అంటే పూనకాలు ఇచ్చే మ్యూజిక్ ని తాను అందించాడని అంతా అంటుంటారు.
మరి తన సినిమాలతో ఇలా ఓ రేంజ్ లో లేపుతూ వచ్చిన థమన్ కి బాలయ్య ఒక ఖరీదైన గిఫ్ట్ ని సర్ప్రైజ్ గా అందించారు. కార్స్ బ్రాండ్ లో లగ్జరీ కార్లని తయారు చేసే పోర్సే బ్రాండ్ నుంచి ఒక బ్రాండ్ న్యూ కార్ ని థమన్ కోసం బాలయ్య నేడు ప్రత్యేకంగా బహుమానంగా ఇవ్వడం జరిగింది. దీనితో ఈ విజువల్స్ ఇపుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇక బాలయ్య థమన్ ల కాంబినేషన్ లో అఖండ పార్ట్ 2 వస్తుంది. ఈ సినిమా మ్యూజిక్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.