దుల్కర్ తో బాలయ్య బాబు!

Monday, December 8, 2025

బాలయ్య ‘అన్‌ స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ద‌స‌రా కానుక‌గా బాల‌య్య మూడో సీజన్ కూడా అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అన్‌స్టాప‌బుల్ మొదటి రెండు సీజన్లు భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే మూడో సీజన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తోందని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ టాక్ షో షూటింగ్ గురించి ఓ లేటెస్ట్ అప్ డేట్ తెలుస్తోంది.

హీరో దుల్కర్ సల్మాన్ తన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘అన్‌ స్టాపబుల్’ షోకి విచ్చేశాడు. ఈ రోజే దుల్కర్ సల్మాన్ తో ఎపిసోడ్ ని చిత్రీకరణ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి.. నిర్మాత నాగవంశీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

బాలయ్య వారితో సరదాగా ముచ్చటిస్తున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇంతకీ, బాలకృష్ణ, వీరి నుంచి ఎన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టబోతున్నారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles