వెంకీ మామ సెట్లో బాలయ్య బాబు!

Sunday, December 22, 2024

విక్టరీ వెంకటేష్‌, బ్లాక్‌ బస్టర్‌ మెషిన్‌ అనిల్‌ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ల సెన్సేషనల్‌ కాంబోలో వస్తున్న వెంకీ అనిల్‌ 03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్‌ షెడ్యూల్‌ ను పూర్తైన తరువాత  ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో న్యూ షూటింగ్‌ షెడ్యూల్‌ జరుగుతుంది.

వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించబోతున్నట్లు చిత్ర వర్గాలు ఎప్పుడో ప్రకటించాయి. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సెట్స్‌ లోకి ఓ ప్రత్యేక అతిథి వచ్చారు. ఆర్‌ఎఫ్‌సీలో లేటెస్ట్ షెడ్యూల్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ #వెంకీఅనిల్3 సెట్స్‌ లో సందడి చేశారు. ఈ ఆన్-లొకేషన్ స్టిల్స్‌లో బాలకృష్ణ, వెంకటేష్, అనిల్ రావిపూడి మధ్య బంధం చాలా బాగుంది.

బాలయ్య రాకతో మూవీ బృందం ఒక్కసారిగా చాలా థ్రిల్‌ అయ్యింది. బాలకృష్ణ, వెంకటేష్ మంచి స్నేహితులు. అనిల్ రావిపూడి ఎన్బీకే ఆల్-టైమ్ హిట్ భగవంత్ కేసరిని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సైమాలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.  విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, SVC ప్రొడక్షన్ నెం 58 కు టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles