3 డిఫరెంట్‌ లుక్స్ లో బాలయ్య బాబు!

Tuesday, January 21, 2025

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109 సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని దర్శకుడు కొల్లి బాబీ రూపొందిస్తుండగా.. బాలయ్య అభిమానులు భారీ అంచనాలు ఈ మూవీపై పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండా.. ఈ సినిమాలో బాలయ్య అయితే మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

ఆల్రెడీ ఫస్ట్ గ్లింప్స్ లో బాలయ్య ఓ డిఫరెంట్‌ లుక్ లో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మధ్యలో ఒక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కూడా దర్శనమిచ్చారు. ఇక రీసెంట్ గానే దర్శకుడు బాబీ ఇచ్చిన పోస్ట్ తో ఆ రెండు కాకుండా పూర్తిగా గడ్డం లేకుండా బాలయ్య కనిపించారు. దీంతో ఇలా మొత్తం మూడు డిఫరెంట్ లుక్స్ లో బాలయ్య ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉన్నారని సమాచారం.

ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా నటిస్తున్నారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles