జైలర్‌ 2 కోసం బాలయ్య బాబు!

Friday, December 5, 2025

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం “అఖండ 2” సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. అయితే, ఈ సినిమాకు జోడీగా బాలయ్య మరో భారీ సీక్వెల్ “జైలర్ 2”లో కూడా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023లో విడుదలైన “జైలర్” చిత్రం ప్రేక్షకుల హృదయాలనుగెలుచుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసులో అద్భుతమైన విజయం సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా “జైలర్ 2” రూపొందుతోంది. ఈ సీక్వెల్ లో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య జైలర్ 2 కోసం 20 రోజులు కాల్షీట్స్ ఇచ్చారనే పుకార్లు బయటకు వచ్చాయి. అంటే ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన లేదనే చెప్పాలి.

ఇదే నిజమైతే, “జైలర్ 2” అభిమానుల కోసం మరింత హైప్ క్రియేట్ చేయనున్నది. బాలయ్య అభిమానులు ఇప్పటికే ఈ వార్తతో చాలా ఆనందంగా ఉన్నారు. మరి దీనిపై మరిన్ని వివరాలు రావడం వరకు ఎదురుచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles