కొత్త సినిమా విడుదల పై బాలయ్య బాబు క్లారిటీ!

Wednesday, January 22, 2025

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబో లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ పై ఇప్పటికే చాలా వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఈ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చారు. సదరు యాంకర్ ‘మీ 109వ మూవీ ఎప్పుడు విడుదల కాబోతుంది ? అని అడగగా.. బాలయ్య సమాధానం ఇస్తూ.. ‘వర్క్ జరుగుతుంది. రీసెంట్ గానే జైపూర్ లో లాంగ్ షెడ్యూల్ షూట్ పూర్తి చేశాం. ఇక రిలీజ్ విషయానికి వస్తే డిసెంబర్ లో లేదా సంక్రాంతికి వచ్చేస్తున్నాం’ అని బాలయ్య సినిమా విడుదల గురించి ఓ క్లారిటీ అయితే ఇచ్చారు.

బాలయ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక, మధ్యలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం వల్ల మూడు మూడున్నర నెలలు పాటు షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా డిసెంబర్ కల్లా విడుదలకు సిద్దంగా ఉంటాం’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాని కచ్చితంగా బాలయ్య అభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ తీర్చిదిద్దుతున్నారట.

 ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని సమాచారం. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles