నందమూరి నటసింహం బాలకృష్ణ ఇపుడు ఒక్క వెండితెర మీదే కాకుండా బుల్లితెరపై కూడా తన మార్క్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఓటిటిలో సూపర్ హిట్ టాక్ షోతో అద్భుతంగా రాణించిన బాలయ్య ఇక గేర్ మార్చబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై హిట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 9 కి బాలయ్య హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది?
ఇపుడు అందుకు పావులు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి బాలయ్య బిగ్ బాస్ సీజన్ లో హోస్ట్ గా ముందుండి నడిపించే ఛాన్స్ ఉందట. మరి ఇదే కానీ నిజం అయితే మాత్రం టీఆర్పీ రేటింగ్స్ మామూలు రేంజ్ లో ఉండవని చెప్పవచ్చు. తన మార్క్ హోస్టింగ్ తో హౌస్ లో కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేయడం మాస్ లెవెల్లో పండవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.