అఖండ 2 విడుదల ఎప్పుడంటే..!

Thursday, December 4, 2025

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘అఖండ 2’ చివరి దశ షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నా, ప్రొడక్షన్‌లో వచ్చిన ఆలస్యాల కారణంగా ప్లాన్ మార్చాల్సి వచ్చింది. దీంతో బాలకృష్ణ స్వయంగా ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు.

ఇదిలా ఉండగా, తాజాగా ‘ఓజీ’ ప్రీమియర్‌లో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ షో ప్రింట్స్‌తో పాటు ‘అఖండ 2’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి రాబోతోంది. ఈ అప్‌డేట్ బయటకు రావడంతో నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా కనిపించగా, ఆది పినిశెట్టి ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీనాథ్ అచంట ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌కి థమన్ బాణీలు అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles