టాలీవుడ్ నటసింహ, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “డాకు మహారాజ్” తో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్య వరుసగా నాలుగు హిట్స్ కొడితే ఇందులో కామన్ గా తనతో పాటుగా మరో పాయింట్ కూడా కనిపిస్తుంది. అదే సంగీత దర్శకుడు థమన్. అఖండ సినిమా నుంచి ఇపుడు డాకు మహారాజ్ వరకు దేనికదే సెపరేట్ క్రేజీ బీట్స్ ఇచ్చిన థమన్ ని అభిమానులు నందమూరి థమన్ అని అంటుంటారు.
అయితే బాలయ్యకి ఈ రేంజ్ డ్యూటీ చేసిన థమన్ వర్క్ ని మెచ్చుకొని బాలయ్య ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ని కూడా నేడు అందించారు. అయితే ఈ అందించిన సమయంలో చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను కూడా థమన్ ని నందమూరి థమన్ అంటూ పిలుస్తూ ఒక తమ్ముడికి అన్నయ్య ఇచ్చే కానుకగా ఇది అంటూ తనని సోదర సమానునిగా కొనియాడారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.