సోదరితో బాలయ్య బాబు రాఖీ సెలబ్రేషన్స్‌!

Friday, December 5, 2025

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ సీక్వెల్ మూవీ అఖండ 2 షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మేకర్స్ తాజాగా ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చిన వెంటనే రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఈ సందర్భంగా బాలయ్య తన అక్క, ప్రముఖ రాజకీయ నాయకురాలు పురందరేశ్వరి తో రాఖీ పండుగను జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీడియోలో అక్కతమ్ముళ్ల మమకారం, ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటోంది. అభిమానులు ఈ క్యూట్ మోమెంట్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య అఖండ 2 సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న విషయం ఇప్పటికే తెలిసినదే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles