ఆ డేట్ లోనే “బాలయ్య 109”?

Saturday, January 18, 2025

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబో లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ఇది వస్తుండగా సాలిడ్ హైప్ ఈ సినిమాపై నెలకొంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా అంతే ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా సినిమా షూటింగ్ ఇప్పుడు చాలా వేగంగా పూర్తి చేసుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది మంచి సస్పెన్స్ గా మారగా విడుదల తేదీకి సంబంధించి ఎప్పటికపుడు డేట్స్ కొత్తవి చిత్ర బృందం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అలా లేటెస్ట్ గా ఈ సినిమా డిసెంబర్ 20 కే వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్ట్రాంగ్ టాక్‌ వినిపిస్తుంది. దీనికి ముందు తర్వాత కూడా సినిమా రావచ్చని తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే డిసెంబర్ 20కే మేకర్స్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అయితే దీని గురించి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles