బ్యాడ్ బాయ్ కార్తీక్ వచ్చేస్తున్నాడు! టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా చాలా రోజుల నుంచి గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ తర్వాత తాను హీరోగా మరో సినిమా చేస్తున్నట్టుగా తాజాగానే ప్రకటించింది. మరి ఫైనల్ గా ప్రాజెక్ట్ పై మేకర్స్ టైటిల్ సహా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన బర్త్ డే కానుకగా విడుదల చేశారు. దర్శకుడు రమేష్ దేసిన తీర్చిదిద్దుతున్న ఈ చిత్రానికి “బ్యాడ్ బాయ్ కార్తీక్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అయితే ఫిక్స్ చేయగా ఇపుడు దీనిపై సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. మరి ఈ పోస్టర్ లో నాగ శౌర్య చేతులకి రక్తం అలాగే నుదుట అదే రక్తంతో అడ్డబొట్టులా కూడా కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా సాలిడ్ యాక్షన్ తోనే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందిన్నారు.