షణ్ముఖ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అవికా!

Sunday, December 22, 2024

 తాజాగా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రంగా రాబోతున్న సినిమా ‘ష‌ణ్ముఖ’. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్,  అవికాగోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. ‘శాస‌న‌స‌భ’ అనే పాన్ ఇండియా సినిమాతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ రెండవ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

 ఇటీవ‌ల జ‌రిగిన చివ‌రి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న అవికాగోర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్‌లో అవికా గోర్ చాలా ముచ్చటగా ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా.. చక్కని సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

అవికా గోర్ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా ఉండేలా అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో క‌థానాయిక అవికాగోర్ సారాగా సాహ‌సోపేత‌మైన ప‌నులు చేసే శ‌క్తివంత‌మైన అమ్మాయి పాత్ర‌లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో అవికాగోర్ త‌న న‌ట‌న‌తో అంద‌రి హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంది. త్వరలోనే చిత్ర విడుదల వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles